రాయదుర్గం: బులోరా వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

70చూసినవారు
రాయదుర్గం: బులోరా వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని బులోరా వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. టి. వీరాపురం గ్రామానికి చెందిన తలారి సుంకన్న రోడ్డు దాటుతుండగా గోవిందవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బులోరా వాహనంతో వేగంగా వచ్చి ఢీకొన్నాడు. దీంతో తలారి సుంకన్న కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్