విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులు, ఆ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్ సహాయకులు చంద్రశేఖర్ కు అందించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కోశాధికారి ఆంజనేయులు, విద్యార్థులు పాల్గొన్నారు.