రాయదుర్గం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడిగా వేడిగా కొనసాగింది. పోరం లేకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని పల్లెపల్లి, వడ్రవన్నూరు సర్పంచ్లు రాజు, అరుణ్ ఎంపీడీవో కొండన్నను ప్రశ్నించారు. ఈ మేరకు అధికారుల వైఖరిని నిరసిస్తూ నేలపై కూర్చొని బైఠాయించారు. అనంతరం సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో రూ. 7లక్షల పనులు జరిగినప్పటికీ 4నెలలు కావస్తున్న బిల్లులు ఎందుకు చెల్లించలేదని అన్నారు.