రాయదుర్గం: సీమకు పూర్తి నీటి వాటా ఇవ్వాలి

51చూసినవారు
రాయదుర్గం: సీమకు పూర్తి నీటి వాటా ఇవ్వాలి
రాయలసీమకు రావాల్సిన పూర్తి నీటివాటా కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంగభద్ర జలాశయంలో పూడిక పెరిగిపోయిందన్నారు. దీంతో 20 టీఎంసీలు తక్కువగా నీరు నిల్వ చేసుకోవాల్సి వస్తోందన్నారు. టీవీ డ్యాం నీటితో 1. 80 లక్షల ఎకరాల్లో వంటలు సాగుచేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్