కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తొలి ఏడాది ప్రగతి నివేదికను అమరావతిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.