బొమ్మనహాల్ మండలం సింగనహళ్లి గ్రామ సమీపంలో వేదావతి హగరి నదులు సంగమం వడ్డున వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా భారీ జన సందోహం మధ్య జరిగింది. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని రథోత్సవంలో ఉంచి ఊరేగించారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, శివ సాయి బాబా పాల్గొని రథోత్సవాన్ని లాగారు. వేలాది మంది భక్తులు రథోత్సవం తిలకించేందుకు వచ్చారు.