ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంగా అందరి ఆదరాభిమానాలు గెలుచుకున్నదని రాయదుర్గం శాసన సభ్యులు కాలవ శ్రీనివాసులు మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 12న గురువారం ఉదయం 10:00 గంటలకు రాయదుర్గం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి R&B అతిధి గృహం వరకు ర్యాలీ సాగుతుందని, ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.