రాయదుర్గం: విద్యుత్ దీపాలతో పరవళ్లు తొక్కుతున్న తుంగభద్రమ్మ

456చూసినవారు
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. డ్యామ్ 21 గేట్లు ఎత్తి 59,220 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో 75. 61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయంలోకి 58,027 క్యూసెక్కులు చేరుతోంది. శుక్రవారం రాత్రి విద్యుత్ దీపాలతో పరవళ్లు తొక్కుతున్న తుంగభద్రమ్మ అందాలు ఆకట్టుకుంటున్నాయి. డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాలను సుందరంగా అభివృద్ధి చేయడంతో పర్యాటకుల సందడి అధికమైంది.

సంబంధిత పోస్ట్