రాయదుర్గం మండలంలో రైతులు నిల్వచేసిన ఉలవ పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రైతులు పండించిన ఉలవపంటను ఉడేగోళం గ్రామం లేఔట్ లో పంట నూర్పిడికి ఉంచారు. మంగళవారం ఉదయం దుండగులు ఉలవకుప్పలకు నిప్పటించడంతో ఒక్కసారిగా భారీఎత్తున మంటలు అంటుకున్నాయి. వెంటనే రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు.