రాయదుర్గం పట్టణంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న ప్రజలకు చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.