కణేకల్లు మండలంలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. దీంతో వేదవతి హగరి పొంగిపొర్లింది. ఆదిగానిపల్లి వద్ద పంటపొలాలు నీట మునిగాయి. బోరుబావుల ద్వారా సాగుచేసిన పత్తిపంట నీట మునిగింది. వరదనీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కల్వర్టు మరమ్మతులకు గురవడంతో వర్షపు నీరంతా పొలాల్లో నిలిచిందని సర్పంచ్ రుద్రముని తెలిపారు. మాల్యం వద్ద కణేకల్లు, ఉరవకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.