రాయదుర్గం: చికిత్స పొందుతూ మహిళ మృతి

76చూసినవారు
రాయదుర్గం: చికిత్స పొందుతూ మహిళ మృతి
బొమ్మనహాళ్ మండల సరిహద్దులోని నేమకల్లు గేటు వద్ద ఈ నెల 5న ప్రైవేట్ బస్సు, బైకును ఢీకొన్న ప్రమాదంలో ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన దేవమ్మ తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే. ఆమె బెంగుళూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. దేవమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్