రాయదుర్గం: రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు

662చూసినవారు
రాయదుర్గం: రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
రాయదుర్గం, మొలకల్మూరు మధ్య పట్టణ శివార్లలో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాయదుర్గం పట్టణంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న భవన నిర్మాణ కార్మికుడు చాంద్ బాషా ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్సల నిమిత్తం బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్