తండ్రి గెలుపుకోసం తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం: విశ్వనాథ్

548చూసినవారు
తండ్రి గెలుపుకోసం తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం: విశ్వనాథ్
రాయదుర్గం: కనేకల్ మండలం ఎన్ హనుమాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గెలుపు కోసం తనయుడు విశ్వనాథరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. గురువారం గ్రామంలో ప్రతి గడపను సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని వివరించారు. సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే రావాలంటే జగనన్ననే మరోసారి సీఎం గా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రాయదుర్గం అభివృద్ధికి మెట్టుని ఆశీర్వదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్