రైలు కింద పడేందుకు ప్రయత్నించిన వృద్ధురాలని కాపాడిన పోలీసులు

61చూసినవారు
రైలు కింద పడేందుకు ప్రయత్నించిన వృద్ధురాలని కాపాడిన పోలీసులు
రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డు రైల్వే గేటు సమీపంలో ఆదివారం రైలుకింద పడేందుకు ప్రయత్నించిన వృద్ధురాలను పోలీసులు కాపాడారు. ఈ వృద్దురాలు ఎవరో తెలియదు. రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడేందుకు వృద్ధురాలు ప్రయత్నించగా గేటు మెన్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పోలీసులు ఆమెను కాపాడి రాయదుర్గం పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు. వృద్ధురాలు బంధువులు గమనించి తీసుకెళ్లాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్