రాయదుర్గం మండలం దేవరెడ్లపల్లికి చెందిన రాధ విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులుు వివరించారు. స్థానికుల వివరాల ప్రకారం వర్షం కురవడంతో ఇల్లు తేమకు గురైందని, మంగళవారం రాధా ఇల్లు శుభ్రం చేస్తుండగా ఫ్రిడ్జ్ తాకడంతో విద్యుత్ షాక్ కి గురైనట్లు వివరించారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆమె అప్పటికే మృతి చెందిందని పరిక్షీంచిన వైద్యులు తెలిపారు.