ఉరవకొండ గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి వజ్రకరూరు ఎంఈఓ ఎర్రిస్వామి నివాళులుల అర్పించారు. పంచాయతీ సెక్రెటరీ గౌస్ పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు జగదీష్, మీనుగ గోపాల్, కన్వీనర్ మధు ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డడన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ, మీనుగ మధు ప్రసాద్, సాకే. పురుషోత్తం ఉన్నారు.