ప్రత్యేక అలంకరణలో వెంకటరమణుడు భక్తులకు దర్శనం

67చూసినవారు
ప్రత్యేక అలంకరణలో వెంకటరమణుడు భక్తులకు దర్శనం
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శనివారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వేకువ జామునే స్వామి వారికి పంచామృత కుంకుమార్చనలు చేపట్టి స్వామి మూలవిరాట్ పై పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది. భక్తులకు పురోహితులు తీర్థప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్