విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరానికి చెందిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనలో భాగంగా రజతోత్సవ వేడుక నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువులను సన్మానించి, గురువులు-విద్యార్థులు మధ్య జరిగిన గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగింది.