ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్, సిడాప్ సంయుక్తంగా నార్పల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు. మేళాలో రెండు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 35 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అందులో 17 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డేవిడ్ తెలిపారు.