ట్రాక్టర్ యజమానులపై అమిగొస్ మినరల్స్, మైనింగ్ శాఖ ట్రాక్టర్లపై రాయల్టీలు, పెనాల్టీల పేరుతో చేస్తున్న వేధింపులు ఆపాలని ట్రాక్టర్ యజమానులు డిమాండ్ చేశారు. ట్రాక్టర్ల యజమానులు, హమాలీలు బుక్కరాయసముద్రం మండలం తహశీల్దార్ ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. సీపీఎం నాయకులు నల్లప్ప మాట్లాడుతూ.. దాడులు చేయడం వలన వందల మంది హమాలీలు, డ్రైవర్లు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.