బుక్కరాయసముద్రం: డివైడర్ ను ఢీకొని లారీ బోల్తా

85చూసినవారు
బుక్కరాయసముద్రం: డివైడర్ ను ఢీకొని లారీ బోల్తా
బుక్కరాయసముద్రం శివారులో తాడిపత్రి వెళ్లే జాతీయ రహదారిపై కర్రల లోడుతో వస్తున్న లారీ బోల్తా పడింది. కడప పట్టణానికి చెందిన వ్యాపారులు లారీలో కర్రలు లోడు చేసుకుని అనంతపురం పట్టణానికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున బుక్కరాయసముద్రం శివారులో రహదారి లోని గుంతను తప్పించబోయి డ్రైవర్ డివైడర్ ను ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. డ్రైవర్, సహాయకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుక్కరాయసముద్రం పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్