బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చిక్ వడియార్ చెరువుకట్ట చుట్టూ కంప చెట్లు ఏపుగా పెరిగిపోయాయి. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారకుండా ఎంపీడీవో సల్మాన్ రాజ్, ఎంపీపీ దాసరి సునీత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం ద్వారా కంపచెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా కంపచెట్లను తొలగిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.