బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం పాత కక్షల కారణంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాజు, హబీబ్ అనే ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.