బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్థులతో సీఐ కరుణాకర్ గురువారం సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని సీఐ కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. నంబర్ ప్లేట్ ఉన్న ద్విచక్ర వాహనాలు మాత్రమే నడపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.