బుక్కరాయసముద్రంలోని తహసీల్దారు కార్యాలయం దగ్గర మరువంక రోడ్డు పై నిలిపి ఉంచిన కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారును డ్రైవర్ మరువ వంక రోడ్డుపై నిలిపి దుకాణానికి వెళ్లాడు. కారుకు హ్యాండ్ బ్రేకులు వేయకపోవడంతో మరువ వంకలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ కారులో లేకపోవడంతో ఎలాంటి అపాయం జరగలేదు.