గార్లదిన్నెలో మహిళపై కేసు నమోదు

85చూసినవారు
గార్లదిన్నెలో మహిళపై కేసు నమోదు
గార్లదిన్నె మండలం తలగాచిపల్లికి చెందిన ఓ మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా ఆదివారం తెలిపారు. ఆయన వివరాల మేరకు గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళను వ్యక్తిగతంగా దూషించాడు. ఈ విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దానితో నల్లప్పకు రక్తగాయం కావడంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నల్లప్ప ఫిర్యాదు మేరకు పద్మావతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్