శింగనమల మండల వ్యాప్తంగా ఆగస్టు 1నుండి7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గురువారం తరిమెల వైద్యాధికారి డాక్టర్ శంకర్ నాయక్ తెలియజేశారు. ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించి, పోస్టర్స్ విడుదల చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత మరియు అపోహల గురించి అవగాహన కల్పించారు. డెలివరి అనంతరం వచ్చే ముర్రుపాలు యొక్క ప్రాముఖ్యత వివరించారు.