నార్పల మండల కేంద్రంలో జరిగిన ఏటీఎం చోరీ కేసును తక్కువ సమయంలో చేదించినందుకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ శింగనమల సీఐ కౌలుట్లయ్యను అభినందించారు. ఆయన చేతులు మీదుగా గురువారం అప్రిషియేట్ సర్టిఫికెట్స్ ను అందచేశారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల మండలాలలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తూ సీఐ కౌలుట్లయ్య ముందుకు వెళుతున్నారని ప్రజలు, సిబ్బంది కొనియాడారు.