అకాల వర్షంతో రైతులకు అపార నష్టం

59చూసినవారు
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం
శింగనమల మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గుమ్మేపల్లి గ్రామానికి చెందిన బ్యాళ్ళ సుదర్శన్ అనే రైతుకు చెంది రెండు ఎకరాలలో సాగు చేసిన కాకర పంట నేలమట్టమైనట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా రెండు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని రైతు బ్యాళ్ళ సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్