నార్పలలోని కొత్త బస్టాండ్ వీధిలో విద్యుత్ స్తంభం ఒకవైపునకు ఒరిగి ప్రమాదకరంగా మారిందని కాలనీ వాసులు తెలిపారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అటుగా వెళ్లాలంటే భయంగా ఉందంటూ కాలనీవాసులు చెప్పారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి తమ సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు కోరారు.