పోలీసుల నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించాలి

60చూసినవారు
పోలీసుల నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించాలి
పోలీసుల నిబంధనల మేరకు గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలని శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. పోలీస్టేషన్ లో ఉత్సవ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు. అదేవిధంగా మండపాల వద్ద డీజేలు వాడటం చేయరాదన్నారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రదేశంలో మండపాలు ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్