శింగనమల మండలం తరిమెల పెన్నానది సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు గురువారం శింగనమల ఎస్సై చంద్ర శేఖర్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, శింగనమల సీఐ ఉత్తర్వుల మేరకు రాబడిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో కలిసి నలుగురు పేకాట రాయుళ్ళను పట్టుకొని వారి నుండి 18, 370 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారినీ కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు.