సామర్థ్యానికి మించి ప్రయాణికులను, సరకును తరలిస్తున్న వాహనాలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గార్లదిన్నె మండలం తలగాసపల్లి జాతీయ రహదారిపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. 12వాహనాలు సీజ్ చేయడంతో పాటు రూ. 90, 700లు జరిమానా విధించినట్లు ఎంవీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.