గార్లదిన్నె: నేషనల్ హైవేపై లారీ దగ్ధం

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు గ్రామ సమీపంలో గల 44వ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం లారీ దగ్ధమైంది. జాతీయ రహదారిపై పని నిమిత్తం డ్రైవర్ లారీని రోడ్డు పక్కకు ఆపి ఉంచగా ఒక్కసారిగా లారీలో నుంచి మంటలు చెలరేగాయి. లారీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతోనే లారీలో మంటలు వ్యాపించినట్లు డ్రైవర్ తెలిపాడు.