గార్లదిన్నె: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలునడిపితే సీజ్ చేస్తాం

85చూసినవారు
గార్లదిన్నె: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలునడిపితే సీజ్ చేస్తాం
గార్లదిన్నె మండలంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే తప్పకుండా సీజ్ చేస్తామని ఎస్ఐ మహమ్మద్ గౌస్ బుధవారం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నెంబర్ ప్లేట్లు లేకుండా చాలామంది వాహనదారులు వాహనాలు నడుపుతున్నారన్నారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు తావు ఇచ్చినట్లు అవుతుందని, తప్పకుండా వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్