బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గోకులం షెడ్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షురాలు దాసరి సునీత, ఎంపీడీఓ సాల్మన్ రాజ్ హాజరయ్యారు. వారిచేతుల మీద పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.