నార్పల మండలంలోని గూగూడు గ్రామంలో శ్రీ కుళ్లాయిస్వామికి దేవస్థానం అధికారులు 28 కేజీల వెండి గొడుగును తయారుచేశారు. ఈ వెండి గొడుగును అగ్నిగుండం చుట్టూ ఊరేగించగా, దాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా భక్తులు పెద్ద ఎత్తున వెండిని సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.