పుట్లూరు మండలంలో వ్యవసాయ అధికారులు పంటకోత ప్రయోగాలు గురువారం చేపట్టారు. మండల పరిధిలోని ఎల్లుట్ల గ్రామంలో రైతు చిన్నవెంగమ్మ, విశ్వనాథ్ పొలాల్లో పప్పుశనగ పంట పరిశీలించి ప్రయోగాలు చేపట్టారు. ఒక తోటలో 1. 550 కేజీలు, మరో తోటలో 1. 150 కేజీలు దిగుబడి వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి కాత్యాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ హరి, వీహెచ్ఎ ప్రవీణ్ పాల్గొన్నారు.