నార్పలలో గురువారం బైకు అదుపుతప్పిన ఘటనలో కేశేపల్లి గ్రామానికి చెందిన కుల్లాయప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నార్పల పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.