కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా. ఇందిరా ప్రియదర్శిని సమక్షంలో గర్భవతులకు శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్ష, బీపీ, మధుమేహ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రక్తహీనతతో ఉన్న గర్భవతులకు ఐరన్ సుక్రోజ్ ఎక్కించామన్నారు. పలువురికి ఉచితంగా స్కానింగ్లు, కాల్షియం మాత్రలు అందజేసినట్లు తెలిపారు.