అనంతపురం జిల్లా ఎస్పీ కె. వి మురళీకృష్ణని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉన్న ఎస్పీకి పూల మొక్క అందజేసి ఎమ్మెల్యే శ్రావణి శుభాకాంక్షలు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గం లో పోలీస్ శాఖకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.