నార్పల: అంగరంగ వైభవంగా వేడుకలు

149చూసినవారు
నార్పల మండలంలోని గూగూడులో కుల్లాయి స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం పీర్ల స్వాములకు వివిధ రకాల పూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించారు. కుల్లాయి స్వామి ఆలయం ఎదురుగా పవిత్రమైన అగ్నిగుండం వెలిగించడంతో భక్తులు చక్కెర చదివింపులు చేసి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్