నార్పల: చోరీ కేసులో దొంగ అరెస్టు

81చూసినవారు
నార్పల: చోరీ కేసులో దొంగ అరెస్టు
2024సంవత్సరం అక్టోబరు 5వ తేదీన వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు, భార్యతో కలిసి నార్పలకు వచ్చాడు. బ్యాంకులో రూ. 3లక్షలు నగదు డ్రా చేసుకుని ద్విచక్రవాహనంలో ఉంచి దుస్తుల దుకాణంలోకి వెళ్లారు. దీన్ని గమనించిన బండి చిన్న చాకచక్యంగా నగదు ఎత్తుకుని పారిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. సోమవారం నార్పల పెట్రోల్ బంక్ దగ్గర దొంగ ఉన్నాడని సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్