నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. జంగంరెడ్డిపల్లికి చెందిన బయమ్మ శనివారం ఉదయం 7 గంటల సమయంలో స్వామి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొలుసును అపహరించినట్టు అనుమానం. ఆమె కుమారుడు చౌరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.