పుట్లూరు: అధికలోడుతో ప్రయాణిస్తే చర్యలు తప్పవు

55చూసినవారు
పుట్లూరు: అధికలోడుతో ప్రయాణిస్తే చర్యలు తప్పవు
ఆటోల్లో ప్రయాణికులను అధికలోడుతో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యబాబు హెచ్చరించారు. పుట్లూరు మండలంలోని కడవకల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆయన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించరాదన్నారు. లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అనంతరం అధికలోడుతో వెళ్లే వాహనాలకు అపరాధ రుసుం విధించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్