పుట్లూరు: ఫ్యాక్షన్ కొనసాగిస్తే చర్యలు

77చూసినవారు
పుట్లూరు: ఫ్యాక్షన్ కొనసాగిస్తే చర్యలు
ఫ్యాక్షన్ కొనసాగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పుట్లూరు సీఐ సత్యబాబు హెచ్చరించారు. యల్లనూరు మండలంలోని మేడికుర్తి గ్రామంలో శని వారం తెల్లవారుజామున పోలీసుల నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కల్గిన రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లు, గడ్డివాముల్లో సోదాలు చేశారు. ఎలాంటి మరణాయుధాలు లభించలేదని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో యల్లనూరు, పుట్లూరు పోలీసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్