పుట్లూరు మండల వ్యాప్తంగా రైతుల పంట సాగు చేసిన వివరాల జాబితాను వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శించినట్లు మండల వ్యవసాయ అధికారి కాత్యాయని గురువారం పేర్కొన్నారు. పుట్లూరు మండల వ్యాప్తంగా దాదాపు 19,148 ఎకరాలలో క్రాప్ బుకింగ్ చేయడం జరిగిందన్నారు. రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శించిన జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.