పుట్లూరు మండలంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని బాలాపురం గ్రామానికి చెందిన జయశ్రీ అనంతపురంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దసరా పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన యువతి మ్యాథ్స్ వెనుకబడడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ హేమాద్రి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.