పుట్లూరు మండలం ఓబులాపురంలో రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని గురువారం అధికారులు నిర్వహించారు. పలు సమస్యలపై ప్రజల నుంచి తహశీల్దార్ శేషారెడ్డి వినతులు స్వీకరించారు. ఓబులాపురంలో సీసీ రోడ్లు వేసినా డ్రైనేజీ కాలువలు వేయలేదన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లపై చేరి అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుందని సీపీఐ మండల కార్యదర్శి పెద్దయ్య అధికారులకు వినతిపత్రం అందజేశారు.